గత 20 ఏళ్లుగా పోలీసుశాఖలో విశిష్ట సేవలందించిన ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ను కేంద్ర హోంశాఖ ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపిక చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఆయనకు ఆర్డర్ ఆఫ్ సేవా అవార్డు లభించింది.

ఆమనగల్లు, మే 10: ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ గత 20 ఏళ్లుగా పోలీసుశాఖలో విశిష్ట సేవలందించినందుకు కేంద్ర హోంశాఖ వారు మెరిటోరియస్ మెడల్‌గా ఎంపికయ్యారు.
బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఆయనకు ఆర్డర్ ఆఫ్ సేవా అవార్డు లభించింది. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ పీసీ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ అభినందనలు తెలిపారు.
