ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్ మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ మార్చి 10.
మొత్తం పోస్టుల్లో 300 కాగా తెలంగాణలో-96, ఏపీలో- 100 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.800. పరీక్ష తర్వాత ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ పిరియడ్ లో రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు https://nats.education.gov.in/ వెబ్‌సైట్ లాగిన్ కావాల్సిందిగా సూచించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీలు
The post సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 పోస్టులు appeared first on tnewstelugu.com.
