వాషింగ్టన్: బ్రిటీష్ స్టార్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు బ్రెజిల్ గౌరవ పౌరసత్వం లభించింది. ఈ వారాంతంలో జరిగే బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ పోటీపడనున్నాడు. హామిల్టన్ గతంలో బ్రెజిల్ రేసులో మూడుసార్లు గెలిచాడు. నవంబర్‌లో, హామిల్టన్‌కు గౌరవ పౌరసత్వం ఇవ్వడానికి కాంగ్రెస్ సభ్యుడు చేసిన ప్రతిపాదన ఆమోదించబడింది. ఫలితంగా, హామిల్టన్‌కు బ్రెజిల్ కాంగ్రెస్ మంగళవారం గౌరవ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఈ గౌరవానికి హామిల్టన్ కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ రేసర్ ఏడుసార్లు ఫార్ములా 1 ఛాంపియన్.
832017