ప్రముఖ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. భారతదేశం గురించి తప్పగా మాట్లాడినందుకు ఆమెపై హెచ్ సీయూ విద్యార్ధి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అర్థరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా…ఆడదానికి స్వాతంత్ర్యం ఎందుకు కావాలి . రాత్రి 12గంటల తర్వాత ఏం పని ఉంటుంది అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైందని..ఎవరూ మనల్ని ఏమ అనొద్దు అనుకున్నా…అందరూ ఏదొక అనేట్లుగానే తయారు అవుతున్నాం..ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదని..మనవైపు కూడా కొంచెం తప్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో అన్నపూర్ణమ్మపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డా సంగతి తెలిసిందే.
భారత్ లో పుట్టడం నా కర్మ..ఇదో స్టుపిడ్ కంట్రీ అన్నారనిసాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువగా చేసి మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు లో కోరారు.
ఇది కూడా చదవండి: తల్లికాబోతున్న దీపికా పదుకొనె..సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం అంటూ పోస్ట్..!
The post స్టార్ సింగర్ చిన్మయిపై కేసు..అలా మాట్లాడిందని.! appeared first on tnewstelugu.com.
