హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 16-20 తేదీల్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు.
జ్యూరిచ్ నగరమే కాకుండా ఇతర స్విస్ నగరాలు, ఇతర యూరప్ దేశాలకు చెందిన ఎన్నారైలు కూడా కేటీఆర్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ స్విట్జర్లాండ్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు వారిని అభినందించారు.
ఈ సాయంత్రం జ్యూరిచ్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశానికి ఆయన రేపు దావోస్ చేరుకోనున్నారు.
