
- రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది
- కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం: సీఈసీ
చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ‘వాగ్దానాలతో మ్యానిఫెస్టోను విడుదల చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది.
ఆ హామీల్లో వాస్తవమెంత? వాటి అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారు? అన్నది తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
