ఇన్నిరోజులు ఓపికతో ఉన్నాము..ఇక ఆట మొదలైంది..ప్రభుత్వ తప్పుల పై వేట కూడా ఈరోజు నుండి మొదలైందన్నారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న LRS నిర్ణయానికి వ్యతిరేఖంగా బాల్కొండ నియోజకవర్గము లో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమములో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి.. రాష్ట్రంలోని 25 లక్షల మంది LRS లబ్దిదారులపై సుమారు 20 వేల కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మేము అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు అన్నారు.. ఇప్పుడు మీరు అన్న 100 రోజులు కూడా ఐపోతున్నాయి. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజా క్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు.
మూడు నెలలు అయినా రైతులకు ఇంకా రైతు బంధు పడలేదు..మహాలక్ష్మి ఊసేలేదు,చేయూత పెన్షన్ మరిచిపోయారని ఆరోపించారు ప్రశాంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం ఒకటేనని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుత అంటూన్న రేవంత్ రెడ్డి… నీ హామీలు అమలు చేయకుంటే ప్రజలే నిన్ను బొంద పెడుతారని హెచ్చరించారు.
LRS తో ఒక్కో ప్లాట్ పై లక్ష రూపాల చొప్పున ప్రభుత్వం లబ్ది పొందేందుకు ప్రణాళికలు చేసిందన్నారు. LRS వల్ల 25 లక్షల మందికి నష్టం జరుగుతుందన్నారు.గతంలో BRS ప్రభుత్వం LRS తీసుకొచ్చినప్పుడు నానా యాగీ చేసి మెమొస్తే.. ఉచితంగా చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై సుమారు 20 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమైందని విమర్శించారు. ఉచితంగానే LRS ను వర్తింపజేసేవరకు పోరాటం ఆపేది లేదన్నారు ప్రశాంత్ రెడ్డి. LRS ఉచితంగా అమలు చేయించుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తం కుమార్ రెడ్డి,సీతక్క,కోమటి రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీఅర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేదిస్తున్న అధికారులకు,పోలీసులకు మేము అధికారం లోకి రాగానే తగిన బుద్ధి చెబుతామన్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు.. మా టైం కూడా వస్తుంది..మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేరు రాసిపెట్టుకుంటామన్నారు. అక్రమ కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ప్రశాంత్ రెడ్డి.
ధర్నా తర్వాత తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు ప్రజలపై భారం మోపకుండా LRS అమలు చేయాలంటూ మెమోరాండం సమర్పించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు
The post హామీలు అమలు చేసేవరకు ప్రజా క్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం appeared first on tnewstelugu.com.
