క్రికెటర్లు హార్థిక్ , క్రునాల్ పాండ్యలకు తమ సమీప బంధువులు కుచ్చుటోపీ పెట్టారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య వీరికి భాగస్వామ్య వ్యాపారంలో దాదాపు రూ. 4.3కోట్లు మేరకు మోసంచేశాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పాండ్య సోదరులు, కజిన్ వైభవన్ కలిసి 2021లో పార్ట్ నర్ షిప్ లో పాలిమర్ బిజినెస్ ప్రారంభించారు. ఇందులో హార్థిక్, క్రునాల్ కు 40శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. మిగతా 20శాతం వాటా ఉన్న వైభవ్ పాండ్య ఈ వ్యాపారం రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు.
అయితే పాండ్య, సోదరులకు తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్ పాండ్య సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన వ్యాపారానికి లాభాలు తగ్గి రూ. 3కోట్ల మేర నష్టం వచ్చింది. అదే సమయంలో వైభవ్ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం నుంచి 33శాతానికి పెంచుకున్నాడు. సంస్థ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బును తన అకౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. ఆవిధంగా మొత్తంగా దాదాపు రూ. 4.3కోట్ల మేర హార్థిక్ సోదరులకు కుచ్చుటోపీ పెట్టాడు.
ఈవిషయంపై క్రికెటర్లు అడగ్గా పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో హార్థిక్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు వైభవ్ ను అరెస్టుచేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడాచదవండి: చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు..ఆరుగురు విద్యార్థులు మృతి.!
The post హార్థిక్ సోదరులకు రూ. 4.3కోట్లు కుచ్చుటోపీ..! appeared first on tnewstelugu.com.