హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు అర్ధరాత్రి వేళల్లో రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్‌లతో రేసింగ్‌లు నిర్వహిస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు. ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తూ వీకెండ్స్ లో మరింత రెచ్చిపోతున్నారు. వీటిని కట్టడి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఐకియా, గచ్చిబౌలి, రాయదుర్గం, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే మార్గాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ సమావేశం
