
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు నగరంలోని ఎక్సెల్ గ్రూప్ కార్యాలయాలు, ఆ కంపెనీ బాస్ నివాసాలపై ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో దాదాపు 60 మంది పాల్గొన్నారు.
