Hyderabad | హైదరాబాద్‌లో వింత దొంగతనం జరిగింది. ఆఖరికి మ్యాన్ హోల్స్‌పై ఉన్న మూతలను కూడా వదలటం లేదు దొంగలు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లో వింత దొంగతనం జరిగింది. ఆఖరికి మ్యాన్ హోల్స్‌పై ఉన్న మూతలను కూడా వదలటం లేదు దొంగలు. గన్ పార్కులోని అమర వీరుల స్థూపం ముందు ఉన్న మూడు మ్యాన్ హోల్స్ పై మూతలను దొంగలు ఎత్తుకెళ్లారు. 30 కిలోల పైనే బరువు ఉన్న ఐరన్ మ్యాన్ హోల్స్ మూతలను అపహరించారు. ఈ ఘటనపై గన్‌పార్కు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
