విప్లవ యోధుడు చే గువేరా కుమార్తె డాక్టర్ అలీడా గువేరా కోల్కతా నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చే గువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తేర్ ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న వారిని అధికారులు, ప్రజాసంఘాల నాయకులు భారీ బందోబస్తులో ఆహ్వానించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సదస్సుకు అలీడా గువేరా, ఎస్తేర్ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.
