ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం తెలంగాణలో భానుడు నిప్పులు కక్కాడు. మంగళవారం, బుధవారం కూడా భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టూవీలర్ మీద బయటకు వెళ్దామన్నా..బస్సుల్లో బయటకు వెళ్లాలనుకున్నా…నగరవాసులు ఎండలో మాడిపోవాల్సిందే. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సులను తగ్గిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని..బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఎండలుభారీగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మధ్యాహ్నం వేళ తప్పనిసరి అయితేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది. మరోవైపు మంగళవారం నుంచి ఉదయం 5 నుంచి అర్థరాత్రి 12గంటల వరకు సీటీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఎన్ని బస్సులు, సర్వీసులు తగ్గిస్తున్నారనే విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో జోన్ చెప్పలేదు. ఇదే విషయాన్ని ఓ అధికారిని అడిగితే ఐదు నిమిషాల్లో బస్సు ఉన్న చోట పది నిమిషాలకోకటి నడుపుతారని తెలిపారు. అంటే 2550 బస్సులకు 1275 అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉదయం 5 నుంచి మొత్తం బస్సులు ఉంటాయని మధ్యాహ్నం 1`2 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరిమితంగా సాయంత్రం 4 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇది కూడాచదవండి: రేపే శ్రీరామనవమి..పూజా విధానం, పండగ విశిష్టత తెలుసుకోండి. !