భారత్‌లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 – 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికెట్టి,
- భారత్‌లో తీవ్రమవుతున్న ఆర్థిక అసమానతలు
న్యూఢిల్లీ, మార్చి 20: భారత్‌లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 – 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికెట్టి, లుకాస్ ఛాన్సెల్, నితిన్ కుమార్ భారతి ఒక నివేదిక రూపొందించారు. 2014 – 15 నుంచి 2022 – 23 మధ్యకాలంలో సంపదను కేంద్రీకరించడం వల్ల ఈ అసమానతలు ఎక్కువగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొన్నది.
022 – 23లో మొత్తం దేశ ప్రజల ఆదాయంలో టాప్ 1 శాతం సంపన్నుల వాటా 22.6 శాతమని, సంపదలో వీరి వాటా 40.1 శాతమని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని నివేదిక తెలిపింది.
దేశంలోని 167 సంపన్న కుటుంబాల నికర సంపదపై 2022 – 23లో 2 % ‘సూపర్ ట్యాక్స్’ విధించి ఉంటే జాతీయ ఆదాయంలో 0.5% అయ్యేదని నివేదిక పేర్కొన్నది.
పన్నుల విధానాన్ని పునర్నిర్మించడం ద్వారా సంపన్నులకే కాకుండా సగటు భారతీయుడికి విద్య, వైద్యం, పోషకాహారం అందించేందుకు వెచ్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
