
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శనివారం లక్ష బిల్వార్చన సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అభిషేకంతో స్వామిని మేల్కొలిపి అలంకరణ, అర్చన చేస్తారని వెల్లడించారు.
ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారికి లక్ష బిల్వ పత్రాలతో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ 100 రూపాయల టిక్కెట్టు కొనుగోలు చేసి లక్ష బిల్వార్చన సేవలో పాల్గొనవచ్చని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకు భక్తులు దర్శనమిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామివారి విగ్రహాన్ని తిరువీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు.
833715
