కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బాలుడు కత్తితో పొడిచి నానమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం..
- జనగామ జిల్లా ఉప్పుగల్లులో ఘటన
జఫర్‌గఢ్, ఏప్రిల్ 14: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బాలుడు కత్తితో పొడిచి నానమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మామిళ్ల ఎల్లమ్మ (65)-ఐలయ్య దంపతుల కొడుకు సమ్మయ్య పదేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కోడలు రజిత ఇద్దరు కుమారులతో కలిసి వారి ఇంట్లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో అత్తాకోడలికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి గొడవ జరగ్గా.. ఆవేశానికి లోనైన రజిత చిన్న కుమారుడు (13) కత్తి తీసుకుని నానమ్మ ఎల్లమ్మను ఛాతిలో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఎల్లమ్మను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవి తెలిపారు.