అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. రెండో దశలో 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 93 స్థానాల్లో 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరో 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లో ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లోని రాణిప్ జిల్లాలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేయగా, అమిత్ షా అహ్మదాబాద్‌లోని నారంపురా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.
డిసెంబర్ 1న, మొదటి దశలో భాగంగా 19 ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీకి 99, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్లో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. గెలుపే లక్ష్యంగా ఆప్ కూడా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి.
869372