2024 Loksabha Elections : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం ప్రకటించగా తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించింది.
2024 Loksabha Elections : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం ప్రకటించగా తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించింది. జేపీ నడ్డా స్వయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పార్టీ ఆయనకు కట్టబెట్టింది.
ఈ నిర్ణయాలకు ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ప్రచార పర్వం వంటి అంశాలపై వేలాది మంది పార్టీ సభ్యుల సమక్షంలో చర్చ చేపట్టారు. 2019లో పార్టీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రి పదవిలో ఉండగా జేపీ నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. 2020లో పార్టీ పూర్తికాల అధ్యక్ష బాద్యతలను జేపీ నడ్డా చేపట్టారు.
ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడింగించారు. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించిందని, కొన్ని రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో తమ ఎమ్మెల్యేలు గెలుపొందారని నడ్డా పదవీకాలం పొడిగింపును ప్రకటిస్తూ అమిత్ షా ఇటీవల ప్రస్తావించారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్ధానాలు, ఎన్డీయే 400పైగా స్దానాల్లో గెలుపొందుతుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
Read More :
