పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రుబాబ్ ఖాన్ మార్చి 1న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్, క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అక్తర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా షోయబ్,రుబాబ్ ఖాన్‌లకు మహ్మద్ మికైల్ అలీ, మహ్మద్ ముజద్దీద్ అలీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2014లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2016లో మొదటి బిడ్డను, 2019లో రెండో బిడ్డను కన్నారు.
Mikaeel & Mujaddid have a baby sister now.
Allah taala has blessed us with a baby daughter.Welcoming Nooreh Ali Akhtar, born during Jumma prayers, 19th of Shaban, 1445 AH.
1st of March, 2024.
Aap sab ki duaon ka talab gaar,
Shoaib Akhtar pic.twitter.com/p8o9tx9I5N— Shoaib Akhtar (@shoaib100mph) March 1, 2024
అక్తర్ తన కుమార్తె నురేహ్ అలీ అక్తర్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్తర్ తన కుమార్తెకు నూరే అలీ అక్తర్ అని పేరు పెట్టాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అల్లా మాకు పండంటి బిడ్డను ప్రసాదించాడు అని పేర్కొన్నాడు. నా కూతురిని మీరంతా ఆశీర్వదించండి అంటూ పోస్టు చేశాడు.
ఇది కూడా చదవండి: అబుదాబి హిందూ దేవాలయంలో సామాన్య భక్తులకు దర్శనం.!
The post 48 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రైన షోయబ్ అక్తర్.! appeared first on tnewstelugu.com.
