అంతర్జాతీయ మీడియా ప్రపంచం రారాజు రూపర్ట్ మర్డోక్. ఆస్ట్రేలియా జాతీయుడు అయినప్పటికీ, అమెరికాలో స్థిరపడి మీడియా రంగంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వందలాది మీడియా సంస్థలను నడిపించిన వ్యక్తి. ది సన్, ది టైమ్స్, ది డైలీ టెలిగ్రాఫ్, హెరాల్డ్ సన్, ది ఆస్ట్రేలియన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వంటి ప్రముఖ దినపత్రికలతో పాటు, హార్పర్ కాలిన్స్ వంటి పుస్తక ప్రచురణ సంస్థ, స్కై న్యూస్ వంటి టీవీ చానళ్లకు ఆయన గతంలో అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ప్రచారం అవుతోందంటే ఓ ప్రత్యేకత ఉంది. రూపర్ట్ మర్డోక్ ఈ వయసులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇదేం రూపర్ట్ కు ఫస్ట్ మ్యారేజ్ కాదు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన…ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.తన ప్రేయసి ఎలెనా జుకోవాతో ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. వీరి పెళ్లి కాలిఫోర్నియాలోని మొరాగా ప్రాంతంలో మర్డోక్ కు చెందిన వైన్ యార్డ్ లో జరగనుందట.
మర్డోక్ పెళ్లాడబోయే నవ వధువు ఎలెనా జుకోవా వయసు 67 సంవత్సరాలు. అది కూడా మర్డోక్ మూడో భార్య వెండీ డెంగ్ ద్వారా జుకోవా పరిచయం అయిందట. జుకోవా ఓ రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఆమె స్వస్థలం రష్యాలోని మాస్కో నగరం.
ఇది కూడా చదవండి:డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలి
