
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు టూరిస్ట్ హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోల్డ్ కోస్ట్ సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలోని ప్రధాన బీచ్లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, సంఘటన జరిగినప్పుడు పర్యాటకులను రైడ్ కోసం తీసుకువెళుతున్నారు.
