
తిరుమల: తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే రూ.768 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఒక్కరోజులో హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 23న వచ్చిన హుండీ ఆదాయం ఇప్పటి వరకు అత్యధికంగా రూ.631 కోట్లు. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనాన్ని సొంతం చేసుకునేందుకు ప్రముఖులు తరలిరావడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైకుంఠ దర్శనం లభించిన సంగతి తెలిసిందే. నిన్న స్వామివారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వైకుంఠ దర్శనం ఈ నెల 11వ తేదీ వరకు ఉండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
