
కర్ణాటకలో విషాదం నెలకొంది. బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న మహీంద్రా బొలెరో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. జిల్లాలోని చుంకియు నూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం వాహనం నుజ్జునుజ్జయింది. మృతులంతా హుల్కుంట గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. సమీపంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు.
