
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రేవా జిల్లా, ఉమ్రి గ్రామంలోని ఆలయ గోపురంపై ఈ (శుక్రవారం) ఉదయం ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం కూలిపోయింది. దీంతో విమానాన్ని నడిపిన పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా, ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
