
మలక్ పేట్‌లోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక సోహైల్ హోటల్ వంటగదిలో మంటలు చెలరేగాయి… పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పొగలు వ్యాపించడంతో రోగులు అవస్థలు పడ్డారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. హోటల్‌లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అతిథులు పారిపోయారు. పొగలు రావడంతో షాబుద్దీన్ (34) అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడు. విద్యుదాఘాతం లేదా కిచెన్ గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
