
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కళా ఉత్సవ్ జాతీయ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ ప్రథమ బహుమతి గెలుచుకుంది. శనివారం భువనేశ్వర్‌లోని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)లో జరిగిన కళా ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో లక్ష్మీప్రియ సా స్త్రీయ నృత్యం (మహిళల విభాగం) పోటీల్లో విజేతగా నిలిచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రులు అన్నపూర్ణాదేవి, సుభాష్ సర్కార్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. లక్ష్మీప్రియ హనుమకొండ కాజీపేట జిల్లాలోని మౌంట్‌ఫోర్ట్ ఉన్నత పాఠశాలలో 9వ సంవత్సరం చదువుతోంది.
