వీడియోకాన్ రుణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు విముక్తి లభించింది. చందా కొచ్చర్తో పాటు ఆమె భర్తను విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఈరోజు (సోమవారం) ఆదేశించింది. వారి అరెస్టు చట్టానికి అనుగుణంగా లేదని కోర్టు తేల్చింది. వీడియోకాన్ కార్పొరేషన్‌కు అక్రమంగా రుణం మంజూరు చేసిన కేసులో చందా కొచ్చర్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
డిసెంబర్ 24న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. 2012లో వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాలిచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చవాన్లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. శిక్షాస్మృతిలోని సెక్షన్ 41ఎను ఉల్లంఘించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు కోర్టు పేర్కొంది.
లక్ష రూపాయల పూచీకత్తుపై వారిద్దరూ విడుదల కానున్నారు. కుటుంబ ప్రయోజనాల కోసం కొచ్చర్ కుటుంబం మోసానికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ యొక్క రుణం నిరర్థక ఆస్తిగా పరిగణించబడింది మరియు బ్యాంక్ మోసంగా ప్రకటించబడింది.
The post చందా కొచ్చర్‌ను విడిపించాలని ముంబై హైకోర్టు ఆదేశం appeared first on T News Telugu.