పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌బం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆహారం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బీన్స్‌తో కూడిన భోజనంలో పాము కూడా కనిపించిందని భోజనం వండిన సిబ్బంది తెలిపారు.
మధ్యాహ్న భోజనం అనంతరం పిల్లలను రంపెల్‌హార్డ్ మెడికల్ కాలేజీకి తరలించారు. చిన్నారులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రాథమిక పాఠశాల జిల్లా ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని డిశ్చార్జి అయింది. ఆగ్రహించిన గ్రామస్తులు ప్రిన్సిపాల్‌పై దాడి చేయడమే కాకుండా ఆయన ద్విచక్ర వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.
