రాష్ట్రమంతా మంచు కమ్మేసింది. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలిని తట్టుకోలేక ప్రజలు మంటలు కట్టారు. రంగారెడ్డిలోని మంగళ్పల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ 7.6, లింగాపూర్ 7.7, రంగారెడ్డి జిల్లా 7.7, ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్ 7.8 మెదక్ ఉమ్మడి జిల్లాలోని మల్చెల్మలో 9.5, గౌరారంలో 10.4, ధర్మారంలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పిల్లలు, పెద్దలు బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. శీతల గాలుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించింది.
