
- గతేడాది 83.. ఈసారి 85
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 83వ స్థానంలో నిలిచింది. ఈసారి రెండు స్థానాలు పడిపోయింది. భారతీయ పాస్‌పోర్ట్‌లు 59 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తాయి. గతంలో 60 దేశాలకు వెళ్లే అవకాశం ఉండగా తాజాగా సెర్బియా ఈ నిబంధనను తొలగించింది. హెన్రీ ఆర్గనైజేషన్ 199 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ విషయంలో, జపాన్ ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్, దక్షిణ కొరియాలు రెండో స్థానంలో నిలవగా, జర్మనీ, స్పెయిన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
