మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్డీ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పది మంది యాత్రికులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు థానే జిల్లా నుండి షిర్డీకి యాత్రికులను తీసుకువెళుతుంది. శుక్రవారం ఉదయం నాసిక్-షిర్డీ హైవేపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంపై గవర్నర్ ఏక్నాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
