హైదరాబాద్‌లో ఈరోజు (శుక్రవారం) మరియు రేపు (శనివారం) MMTS రైలు సేవలు రద్దు చేయబడ్డాయి. ట్రాక్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్ పనుల కారణంగా జంటనగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసు నేడు (జనవరి 13), రేపు (జనవరి 14) రద్దు కానున్నట్లు అధికారులు తెలిపారు.
లింగంపల్లి-నాంపల్లి మార్గంలో రెండు సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి రూట్‌లో మూడు సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 6 సర్వీసులు, రాంచంద్రపురం-ఫలక్‌నుమా రూట్‌లో 1 సర్వీసు, ఫలక్‌నుమా-రాంచంద్రాపురం రూట్‌లో 1 సర్వీసు, ఫలక్‌నుమా-నాంపల్లి రూట్‌లో 1 సర్వీసును రద్దు చేశారు. మొత్తం 19 సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
The post రెండు రోజుల క్రితం MMTS రైలు రద్దు appeared first on T News Telugu.
