వచ్చే నెల 2వ తేదీన వినువీధిలో అద్భుతం జరగనుంది. అత్యంత అరుదైన పచ్చటి తోకచుక్క ఒకటి భూమికి చేరువ కానుంది. ఆ రోజు, అది భూమి నుండి 4.2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమికి సూర్యుని చుట్టూ తోకచుక్క కక్ష్యలో ఇదే అత్యంత సమీప బిందువు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సూర్యుని చుట్టూ తిరిగే ఆకుపచ్చ తోకచుక్క ఒక కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపు 50,000 సంవత్సరాలు పడుతుంది. ఇది జనవరి 12న సూర్యునికి దగ్గరగా చేరి ఫిబ్రవరి 2న భూమికి చేరుకుంటుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా బైనాక్యులర్స్ తో ఈ తోకచుక్కను వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తోకచుక్క సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, దాని పదార్థం యొక్క స్వభావం కారణంగా సూర్యకాంతిలో ఆకుపచ్చగా కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది భూమికి చేరువైనప్పుడు, ఆకుపచ్చ కామెట్లోని మంచుతో కూడిన పదార్థం కాలిపోయి, దాని వెనుక పొడవైన తెల్లటి తోకను ఏర్పరుస్తుంది.
