
హైదరాబాద్: హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ ముఖరం ఝా బహదూర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ముఖరం ఝా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. నిజాం నవాబ్ భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరమ్ ఝా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించారు.
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని అసఫ్ జాహీ సమాధిలో అంతిమ వేడుకలు నిర్వహించనున్నారు. ముకరం ఝా మృతదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో భద్రపరచనున్నారు.
