
హైదరాబాద్: లంగర్హాస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మోతీ దర్వాజా, జీఎంకే మల్టీపర్పస్ హాల్ ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు ఉప్పల్‌కు చెందిన కలీం(19)గా గుర్తించారు. కలీమ్‌ను తామే హత్య చేశామని ముగ్గురు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు.
