రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. ఆదివారం పీవీ మార్గ్‌లోని పీపుల్స్ స్క్వేర్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, విదేశీయులు కూడా మన ఆచార వ్యవహారాలను గౌరవిస్తారని అన్నారు. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని, యువతులు, యువతులు తమ ఇళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటారని వివరించారు.
పండుగ మన సంస్కృతిని చాటిచెబుతుందని అన్నారు. పండుగల తీరుతెన్నులు, సంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమై పంటలు బాగా పండాయని మంత్రి అన్నారు.
