హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శాఖల పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గృహనిర్మాణ శాఖను రవాణా, రోడ్లు, భవనాల శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ, డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త ప్లాన్లను స్వీకరించకపోవడంతో హౌసింగ్ రంగాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఆస్తులు, కార్యక్రమాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ అండ్ బీ విభాగంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.
