
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రేపు ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని టీటీడీ ప్రకటించింది. టీటీడీ ప్రతిరోజూ వేల సంఖ్యలో శ్రీవాణి టిక్కెట్లను జారీ చేస్తుంది. వీటిలో 750 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, మరో 250 టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేయనున్నారు. శ్రీవాణి టిక్కెట్లు కావాలనుకునే భక్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
