
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కంపెనీలో చేరిన మూడు రోజుల తర్వాత ఇది జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్ (రవికుమార్, 35 ఏళ్లు) అనే యువకుడు ఈ నెల 17న మరో 10 మందితో కలిసి ఓడలో పని చేసేందుకు అమెరికా వెళ్లాడు. మూడు రోజుల కిందటే సీమాన్‌గా ఉద్యోగంలో చేరాడు. రవికుమార్ విధులు నిర్వహిస్తుండగా కంటైనర్‌పై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయాన్ని కంపెనీ ప్రతినిధి కుటుంబీకులకు తెలియజేయడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా వెళ్లాలని ఆశపడ్డ కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని మృతుని కుటుంబీకులు కోరుతున్నారు.
