
భారత రాష్ట్ర సమితి (BRS) దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈరోజు (శుక్రవారం) ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌ను సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. BRSలో హేమా గమాంగ్, జయరామ్ పాంగి, రామచంద్ర హంష్దా, బృందావన్ మాఝీ, నబీన్ నందా, రాథా దాస్, భాగీరథి సేథి మరియు మాయాదర్ జెనా చేరారు.
