
జమ్మూకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందుకు తిరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సర్సాలాన్ సమీపంలో జమ్మూ నుంచి దొడ్డా వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు.
