హైదరాబాద్‌లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. వసుధ ఫార్మా కెమికల్స్ లిమిటెడ్‌లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఐటీ అధికారులు 30 మందికి పైగా బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, గిడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ రాజు వసుధ ఫార్మా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.
The post హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు appeared first on T News Telugu.
