నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాల బడ్జెట్లా ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యానికి బడ్జెట్ ఉదాహరణ అని ఆమె అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు మంచి వేతనాలు అందిస్తున్నామని, ప్రస్తుతం మంత్రి ప్రకటించిన పన్ను రాయితీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని అందుకే రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
రానున్న పార్లమెంటు ఎన్నికలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రకటించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మౌలిక సదుపాయాలకు వెయ్యికోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నారని, కానీ బడ్జెట్లో మౌలిక వసతుల గురించి వెల్లడించలేదని ఆమె విమర్శించారు. కేంద్రం తమకు దాదాపు రూ.100 కోట్లు బకాయి ఉందని, బకాయిలు చెల్లించాలని ఆర్థిక మంత్రిని కోరామని కవిత తెలిపారు.
ఈ బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకే..! appeared first on T News Telugu
