తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో తమిళనాడు విద్యార్థులు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ లా స్కూల్ విద్యార్థులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆ క్రమంలో ఏపీ సరిహద్దులోని ఎస్వీ పురం టోల్ బూత్ వద్ద వారి కారు ఆగింది. అయితే కారు ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయకపోవడంతో డబ్బులు చెల్లించాలని, కారు ఆపివేస్తే ఇతర వాహనాలు వెళ్తాయని టోల్ బూత్ సిబ్బంది సూచించారు. అయితే ఆగ్రహించిన విద్యార్థులు అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో విద్యార్థులు టోల్ బూత్ సిబ్బందిపై దాడి చేశారు.
ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు దాడి చేయడంతో టోల్ బూత్ రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కాసేపు అక్కడే ఉన్న విద్యార్థులు ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అడ్డుకుని తమిళనాడుకు చెందిన వాహనాలను వదిలేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి తప్పించారు.
810953