ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇతర రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపారు. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ ఎస్ లో చేరారు. బోకర్ తాలూకా రాఠి సర్పంచ్ మల్లేష్ తో పాటు వంద మంది గురువారం బీఆర్ ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నేత బామిని రాజన్న ఆధ్వర్యంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తమకు అందజేయాలని కోరుతూ పలువురు నాయకులు, స్థానికులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చూసి బీఆర్ ఎస్ లో చేరారన్నారు.
