కేరళలోని కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రి సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారు మంటల్లో గర్భిణి సహా ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతులను కుట్టియత్తూరుకు చెందిన రీషా (26), ఆమె భర్త ప్రజిత్ (32)గా గుర్తించినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. గర్భిణి భర్త డ్రైవింగ్ చేస్తుంటే, ముందు వరుసలో గర్భిణి, వెనుక వరుసలో మరో నలుగురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోంచి నలుగురు వ్యక్తులు, వెనుక సీటులో ఉన్న ఓ చిన్నారి దిగిపోయారు.
అదే సమయంలో డోర్ జామ్ కావడంతో ముందు సీట్లో ఉన్న ఇద్దరు తప్పించుకోలేకపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు, ఆరుగురు సభ్యుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం.
