తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ, ఆహార పరిశ్రమలకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో డెయిరీ అండ్ ఫుడ్ ఎక్స్పో (2023)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోషక గుణాలున్న పాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉందన్నారు.
హైదరాబాద్ నగరానికి రోజుకు 1 మిలియన్ లీటర్ల పాలు అవసరం కాగా, సరఫరా 6-7 మిలియన్ లీటర్లు మాత్రమే ఉందన్నారు. అదనపు పాల ఉత్పత్తికి ఎక్కువ పశువుల పెంపకం అవసరమని చెప్పారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ సోమ భరత్ మాట్లాడుతూ ముగింపు దశకు చేరుకున్న విజయ డెయిరీ ఎవరూ ఊహించనంతగా ఎదిగిందన్నారు.