టర్కీని వరుస భూకంపాలు వణికించాయి. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో 12 గంటల్లోనే మళ్లీ భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 1:24 గంటలకు ఎకినోషు యొక్క దక్షిణ-ఆగ్నేయంలో భూకంపం సంభవించినట్లు మున్సిపల్ విపత్తు నివారణ సంస్థ ధృవీకరించింది.
సోమవారం ఉదయం సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందగా, ఆస్తి నష్టం భారీగా జరిగింది. భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానిక మీడియా పేర్కొంది. U.S. జియోలాజికల్ సర్వే మరణాల సంఖ్య పదుల సంఖ్యలో ఉన్నట్లు పేర్కొంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ 1939 తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రకటించారు. భూకంపం ధాటికి 2,818 భవనాలు ధ్వంసమయ్యాయి.
