
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా బీజేపీ పాలన ఉంది. దురహంకార బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఏకం కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.