
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ప్రయాణిస్తున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నగర పర్యటనలో భాగంగా బార్వద్దా ఎయిర్‌స్ట్రిప్ నుండి గ్లైడర్ బయలుదేరింది. అర కిలోమీటరు తర్వాత విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విమానం అదుపు తప్పి ఇంటి పిల్లర్‌ను ఢీకొట్టింది. విమానం ముక్కలు ముక్కలైంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆకాశంలో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా తమ ఇంటిపైకి దూసుకెళ్లడంతో భయాందోళనకు గురయ్యామని ఇంటి యజమాని నీలేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణం తెలియదని అన్నారు.
